న్యూఢిల్లీ, నవంబర్ 14: బజాజ్ ఆటోకు చెందిన విదేశీ బ్రాండ్ కేటీఎం ఒకేసారి భారతీయ మార్కెట్లోకి పది బైకులను విడుదల చేసింది. నాలుగు సెగ్మెంట్లలో లభించనున్న ఈ బైకులు రూ.4.75 లక్షలు మొదలుకొని రూ.22.96 లక్షల గరిష్ఠ స్థాయి ధరల్లో లభించనున్నాయి.
భారత్లో స్పోర్ట్ బైకులకు డిమాండ్ అధికంగా ఉన్నదని, రెడీ టూ రేస్ నినాదంతో దేశంలో అన్నిరకాల బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ వర్గాలు చెప్తున్నాయి.