హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ నూతన సీఎండీగా కృష్ణభాస్కర్‌ను ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్‌కో సీఎండీగా ఉన్న ఆయన సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతలప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వులందుకున్న కృష్ణభాస్కర్ మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌కు చేరుకుని సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ఆయన సీఎండీగా కొనసాగనున్నారు.
అయితే ఇంతకాలం సీఎండీగా పనిచేసిన ఎన్ బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఈ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. మరోవైపు ఒడిశాలో 4,900 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనున్నట్టు సింగరేణి ప్రకటించింది. దీంట్లో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌తోపాటు 2,500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మించతలపెట్టింది.