Income Tax | మీరు ఐటీ చెల్లిస్తున్నారా? అయితే, సెక్షన్ 87ఏ రిబేట్ ఎంటో తెలుసా!
ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. పాత, కొత్త పన్ను విధానాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు రాయితీని పొందే వెసులుబాటున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటు ఈ దేశంలో నివసిస్తున్న ట్యాక్స్‌పేయర్లకు లభిస్తుంది.
Income Tax | న్యూఢిల్లీ, మే 18: ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. పాత, కొత్త పన్ను విధానాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు రాయితీని పొందే వెసులుబాటున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటు ఈ దేశంలో నివసిస్తున్న ట్యాక్స్‌పేయర్లకు లభిస్తుంది.
పాత పన్ను విధానంలో..
పాత పన్ను విధానంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5 లక్షలు దాటనైట్టెతే.. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేటును పొందవచ్చు. ఈ విధానంలో రూ.2.50 లక్షల వరకు ఏ పన్నూ లేదన్న విషయం తెలిసిందే. మిగతా రూ.2.50 లక్షలకు 5 శాతం పన్ను పడుతుంది. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇది రూ.12,500 పన్నుకు సమానం. దీంతో ఈ మొత్తాన్ని సెక్షన్ 87ఏ కింద రిబేటుగా క్లెయిం చేసుకోవచ్చు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.4 లక్షలే ఉంటే ట్యాక్స్ రిబేటు రూ.7,500గానే ఉంటుంది. మొత్తంగా చూసినైట్టెతే ఈ విధానంలో ట్యాక్స్ రిబేటు ఎంతైనా తగ్గుతుందిగానీ, రూ.12,500 మాత్రం దాటదు.
కొత్త పన్ను విధానంలో..
సెక్షన్ 115బీఏసీ(1ఏ) కింద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న ట్యాక్స్ పేయర్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.7 లక్షలు దాటనైట్టెతే.. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేటును అందుకోవచ్చు. నిజానికి గతంలో రూ.5 లక్షల వరకే ఈ ప్రయోజనం అందుబాటులో ఉన్నది. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను దీన్ని రూ.7 లక్షలకు పెంచారు. ఇక కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.7 లక్షలుగా ఉంటే.. ఆ మిగతా రూ.4 లక్షలకు రూ.25,000 పన్ను రిబేటు లభిస్తుంది. తొలి రూ.3 లక్షలకు 5 శాతం చొప్పున రూ.15,000, ఆ తర్వాతి లక్ష రూపాయలకు 10 శాతం చొప్పున రూ.10,000. మొత్తం రూ.25,000 రాయితీ అందుకోవచ్చు. అయితే వార్షిక ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం రిబేటు లభించదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

