బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Jan 30, 2021 , 21:22:27

రిల‌య‌న్స్‌లో విలీనానికి అలెగ్జాండ‌ర్‌లా అమెజాన్ అడ్డుపుల్ల‌

రిల‌య‌న్స్‌లో విలీనానికి అలెగ్జాండ‌ర్‌లా అమెజాన్ అడ్డుపుల్ల‌

న్యూఢిల్లీ: అమెజాన్‌పై ప్యూచ‌ర్ రిటైల్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ నిప్పులు చెరిగారు. ముకేశ్ అంబానీ సార‌థ్యంలోని భూగోళాన్ని ఏలాల‌న్న క్రూర‌బుద్ధితో గ్రేట్ అలెగ్జాండ‌ర్ భావించిన‌ట్లే గ్లోబ‌ల్ రిటైల్ మార్కెట్‌ను శాసించాల‌న్న ల‌క్ష్యంతోనే రిల‌య‌న్స్ రిటైల్‌కు 3.4 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఫ్యూచ‌ర్స్ రిటైల్ ఆస్తుల విక్ర‌య ఒప్పందాన్నిఅడ్డుకోవ‌డానికి అమెజాన్ డాట్ కామ్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని పేర్కొంటూ శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత త‌న సిబ్బందికి రాసిన ఇంట‌ర్న‌ల్ మెమోలో కిశోర్ బియానీ ఆరోపించారు.

ఇంత‌కుముందు త‌మ‌తో చేసుకున్న కాంట్రాక్ట్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించి, రిల‌య‌న్స్‌కు త‌మ నెట్‌వ‌ర్క్ విక్ర‌యించింద‌ని ఆరోపిస్తూ ఫ్యూచ‌ర్స్ రిటైల్‌పై అమెజాన్ న్యాయ పోరాటానికి దిగిన సంగ‌తి తెలిసిందే. కానీ తామేమీ త‌ప్పు చేయ‌లేద‌ని ఫ్యూచ‌ర్స్ వాదిస్తోంది. తాజాగా కిశోర్ బియానీని సివిల్ జైలుకు పంపాల‌ని న్యాయ‌స్థానంలో తాజాగా అమెజాన్ వాదించింది. ఢిల్లీ హైకోర్టులో ఈ వార‌మంతా ఇరు ప‌క్షాల మ‌ధ్య వాడివేడిగా వాద ప్ర‌తివాద‌న‌లు జ‌రుగుతున్నాయి.

భార‌త‌దేశంలోనే రెండో అతిపెద్ద రిటైలర్‌గా పేరొందిన ఫ్యూచ‌ర్స్ రిటైల్ నెట్‌వ‌ర్క్‌కు చెందిన 1700 స్టోర్లు, వే‌ల మంది ఉద్యోగుల మ‌నుగ‌డకు రిల‌య‌న్స్‌తో ఒప్పందంపైనే కీల‌క‌మ‌‌ని కిశోర్ బియానీ పేర్కొన్నారు. భార‌త మార్కెట్‌పై కార్పొరేట్ల మ‌ధ్య సాగుతున్న యుద్ధం అని కిశోర్ బియానీ త‌న సిబ్బందికి పంపిన ఈ-మెయిల్‌లో వెల్ల‌డించారు. అమెజాన్ వైఖ‌రి.. ప్లేయింగ్ ది డాగ్ ఇన్ ది మాంగ‌ర్ అన్న‌ట్లు ఉంద‌ని ఆరోపించారు.

ప్ర‌పంచాన్ని ఏలాల‌న్న దుర్బుద్ధితో గ్రేట్ అలెగ్జాండ‌ర్ ప్ర‌పంచ దేశాల‌పై క్రూర‌మైన దాడికి దిగిన‌ట్లే, అమెజాన్ ధోర‌ణి ఉంద‌న్నారు. కానీ అలెగ్జాండ‌ర్ ప‌లు దేశాల‌ను గెలుచుకున్నా, భార‌త్‌లో ఓట‌మి పాల‌య్యాడ‌న్న చ‌రిత్ర మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo