చెన్నై, సెప్టెంబర్ 7: దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ లూనాను అందుబాటులోకి తీసుకొచ్చింది కెనిటిక్ గ్రూపు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘చల్ మేరి లూనా’ మోపెడ్ వాహనమైన ఈ వాహనాన్ని ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రవేశపెట్టింది సంస్థ. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ లూనా..2 కిలోవాట్లు, 3 కిలోవాట్ల బ్యాటరీతో రూపొందించింది.
ఒక్కసారి రీచార్జితో 80 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ మోడల్ ధర రూ.85 వేలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో సులాజ్జా ఫిరోదియా మాట్లాడుతూ…ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా రూ.100 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నూతన ప్లాంట్‌లో నెలకు 25 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి కానున్నాయి.