హైదరాబాద్, జూన్ 6: కినారా క్యాపిటల్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రూ.800 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి తిరునవుక్కారాసు తెలిపారు. ఇప్పటికే రూ.1,200 కోట్లు మంజూరు చేసింది.