Kia Electric Cars | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. తన ఎలక్ట్రిక్ కారు ‘ఈవీ5 (EV5)`తోపాటు మూడు ఈవీ కార్లను ఆవిష్కరించింది. సియోల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈవీ5 (EV5) స్పెషిఫికేషన్లను వెల్లడించింది. సింగిల్ చార్జింగ్ తో 720 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం ఈ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సొంతం అని కియా మోటార్స్ ప్రకటించింది.
ఈవీ5తోపాటు ఈవీ3 కంపాక్ట్ ఎస్యూవీ, ఈవీ4 సెడాన్ మోడల్ కార్లను ఆవిష్కరించారు. గత ఆగస్టులో ప్రదర్శించిన ఈవీ5 కారును తొలుత దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తుంది కియా మోటార్స్.
కియా ఈవీ5 కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లు, మూడు పవర్ ట్రైన్ ఆప్షన్లలో వస్తున్నది. స్టాండర్డ్, లాంగ్ రేంజ్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్లలో లభ్యం అవుతుంది.
స్టాండర్డ్ వేరియంట్ 217 పీఎస్ ఎలక్ట్రిక్ మోటార్, 64 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ చార్జింగ్‌తో 530 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 217 పీఎస్ ఎలక్ట్రిక్ మోటార్, 88 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటంతోపాటు సింగిల్ చార్జింగ్ తో 720 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ డ్యుయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ మీద 217 పీఎస్ విద్యుత్, రేర్ యాక్సిల్ మీద 95 పీఎస్ విద్యుత్ వెలువరిస్తుంది. 88 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్ గల ఈ కారు సింగిల్ చార్జింగ్ తో 650 కి.మీ దూరం వరకూ వెళుతుంది. సూపర్ ఫాస్ట్ డీసీ చార్జర్ సాయంతో 30-100 శాతం వరకూ చార్జింగ్ చేయొచ్చు.
కియా ఈవీ5 కారు 12.3-12.3 అంగుళాల డాష్ బోర్డుతో కూడిన టూ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్లు ఉంటాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం అవుతుంటాయి. వీటిల్లో ఒకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మరొకటి డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే. 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వెహికల్ టు లోడ్ (వీ2ఎల్), వెహికల్ టు గ్రిడ్ (వీ2జీ) ఉంటాయి.
సేఫ్టీ కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, పార్కింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.