న్యూఢిల్లీ, జనవరి 17: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దేశీయంగా అత్యంత మందిని ఆకట్టుకున్న సైరోస్లోనే మరో మాడల్‌ను తీసుకొచ్చింది. పెట్రోల్ కారు ధర రూ.9.89 లక్షలుగా నిర్ణ యించిన సంస్థ..డీజిల్ మాడల్ రూ.10,63, 900గా నిర్ణయించింది.
పాత దాంతో పోలిస్తే కొత్త మాడల్‌లో ఏడు అదనపు ఫీచర్స్‌ను జత చేసినట్టు, ముఖ్యంగా స్పేస్‌ను పెంచినట్టు, భద్రతకు పెద్ద పీట వేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, మరో 20 భద్రత ఫీచర్లతోపాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లతో తయారు చేసింది.