Keeway SR125 | భారతీయ మార్కెట్లో ‘కీవే ఇండియా’ కంపెనీ నుంచి సరికొత్త బైక్ ‘కీవే ఎస్ఆర్125’ విడుదలైంది. ఈ బైకు ఎక్స్ షోరూం ప్రైస్ రూ. 1,19,000 గా ఉన్నది. మూడు కలర్ ఆప్సన్స్ – గ్లోసీ రెడ్ ,గ్లోసీ బ్లాక్, గ్లోసీ వైట్ కలర్స్‌లో బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలనే బుకింగ్స్ ప్రారంభించిన కీవే ఇండియా సంస్థ.. ఈ నెల చివరికల్లా బైకులను డెలివరీ చేయనున్నది. సంస్థ అధికారిక వెబ్సైట్లోగానీ, అధికారిక డీలర్ వద్దగానీ రూ.1,000 అడ్వాన్స్ పేమెంట్ చేయడం ద్వారా ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
కొత్త ‘కీవే ఎస్ఆర్125’ బైక్‌ను రెట్రో డిజైన్‌తో తయారుచేశారు. దీనిలోని అన్ని ఫీచర్స్ వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయి. హాలోజన్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. సింగిల్-పీస్ సీట్, షార్ట్ ఫెండర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. సింగిల్ పాడ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ రీడౌట్ మొదలైనవాటిని కలిగి ఉంటుంది. 14 లీటర్ల కెపాసిటీ ఫ్యూయెల్ ట్యాంక్‌తో 200 కేజీల వరకు బరువు కలిగి ఉన్నది.
సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్‌తో 9.7 హెచ్‌పీ పవర్, 8.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం ప్రత్యేకత. బైక్ ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో 210 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. టీవీఎస్ రైడర్, హోండా షైన్, హోండా ఎస్పీ125, బజాజ్ పల్సర్ 125 బైకులతో మార్కెట్లో పోటీ ఎదుర్కొంటున్నది.