Kawasaki Hybrid Motor Bike | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కవాసకీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రీడ్ మోటార్ సైకిల్ `నింజా 7 హెచ్ఈవీ`ని ఆవిష్కరించింది. 48 ఓల్టుల బ్యాటరీ ప్యాక్‌తోపాటు తొమ్మిది కిలోవాట్ల ట్రాక్షన్ మోటార్, 451 సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ కంబుష్టన్ ఇంజిన్‌తో వస్తున్నదీ బైక్. హెచ్ఈవీ అంటే హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సంప్రదాయంగా బైక్‌ల్లో వాడే క్లచ్ గేర్ స్థానంలో హోండా డీసీటీ గేర్‌బాక్స్ గుర్తుకొచ్చేలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్విచ్ క్లస్టర్‌పై షిఫ్ట్ పెడల్స్ జత చేశారు. 2024 జనవరిలో యూరప్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కవాసకీ తెలిపింది. భారత్ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న అంశంపై సమాచారం లేదు.
కవాసకీ నింజా 7 హెచ్ఈవీ` రైడర్లు ప్రయాణ సమయంలో ఏ గేర్‌లో వెళుతున్నదాంతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ లాంచ్ పొజిషన్ ఫైండర్ సాయంతో బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ గేర్‌లోకి వెళ్లిపోవచ్చు. ఈ బైక్‌లో పర్యావరణ హిత ఫీచర్ ఉంటది. కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ ఆప్షన్ నొక్కి ట్రోటిల్ గ్రిప్ ట్విస్టింగ్తో ఆటోమేటిక్ రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి.
నింజా, జడ్ఈ-1 మోటార్ సైకిళ్ల మాదిరిగా కవాసకీ `నింజా 7 హెచ్ఈవీ` బైక్.. బ్లూటూత్ ఎనేబుల్డ్ టీఎఫ్టీ డాష్‌బోర్డ్ ఫీచర్ కలిగి ఉంటుంది. నోటిఫికేషన్, నేవిగేషన్ అలర్ట్‌లతో అలర్ట్ కావచ్చు. స్పోర్ట్ హైబ్రీడ్, ఎకో హైబ్రీడ్, ఈవీ మోడ్స్‌లో లభిస్తుంది. నింజా 7 మోటార్ సైకిల్‌ను పోలి ఉండే 650-700సీసీ కెపాసిటీ గల `నింజా 7 హెచ్ఈవీ బైక్ ఇంజిన్ 250సీసీ మోటారు సైకిల్‌తో సమానంగా ఫ్యుయల్ ఎఫిషియెన్సీ ఉంటది.
న్యూ కవాసకీ ఈ-1,జడ్-ఈ1 మాదిరిగా నింజా 7 హెచ్ఈవీ ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేతోపాటు ఆటోమేటిక్ లాంచ్ పొజిషన్ ఫైండర్, ఇంధనం ఆదా కోసం కంబుష్టన్ ఇంజిన్ హాల్ట్ చేయడానికి ఐడిల్ స్టాఫ్ ఫంక్షన్, క్లచ్ లీవర్ స్థానే హ్యాండిల్ బార్ మౌంటెడ్ పుష్ బటన్ షిప్టింగ్,నింజా ఈ-1, జడ్ ఈ-1 మోడల్ బైక్స్‌లో మాదిరిగా వాక్ మోడ్, లో స్పీడ్ రివర్స్, ఫార్వర్డ్ ఆప్షన్లు తదితర ఫీచర్లు ఉంటాయి.