June Car Discount Offers | మీరు కారు కొనుక్కోవాలని ప్లానింగ్ చేస్తున్నారా.. అయితే మీ ప్లాన్‌కు అనుగుణంగా కారు కొనుక్కోవడానికి జూన్ సరైన నెల.. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హోండా కార్స్, టాటా మోటార్స్ వివిధ మోడల్ కార్లపై రూ.27,400 నుంచి రూ.60 వేల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. హోండా కార్స్లో గరిష్ఠంగా రూ.27,400 రాయితీ లభిస్తుండగా, టాటా మోటార్స్ గరిష్ఠంగా రూ.60 వేల వరకు రకరకాల డిస్కౌంట్ కల్పిస్తున్నది. ఈ డిస్కౌంట్లలో ఎక్స్చేంజ్ బోనస్, లాయాల్టీ బెనిఫిట్లు, క్యాష్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ రెండు కార్లు ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్లు ఏమిటో చూద్దామా.. !
న్యూ హోండా అమేజ్‌పై రూ.5000 క్యాష్ డిస్కౌంట్, రూ.5000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్, రూ.7,000 లాయాల్టీ ఎక్స్చేంజ్ బోనస్‌తోపాటు రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మొత్తం డిస్కౌంట్ రూ.27,400 లభిస్తుంది. 1.2 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్ గల కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వర్షన్ కారు ఇంజిన్ 89 బీహెచ్పీ ఇంధనం, 110 ఎన్ఎం సామర్థ్యం గల టార్చి ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ వర్షన్ 99 బీహెచ్పీ ఇంధనం, 200 ఎన్ఎం టార్చి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కారు రూ.6.56 లక్షల నుంచి అందుబాటులో ఉంది.
హోండా సిటీ ఫోర్త్ జనరేషన్‌పై మొత్తం రూ.12 వేల డిస్కౌంట్ పొందొచ్చు. లాయాల్టీ బోనస్ కింద రూ.5,000, లాయాల్టీ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.7000 అందిస్తున్నది హోండా కార్స్. అయితే, పెట్రోల్ వర్షన్ కారుపైనే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ కారు ధర రూ.9.94 లక్షల నుంచి మొదలవుతుంది. 7 స్పీడ్ సీవీటీ ట్రాన్స్మిషన్, 1.5 లీటర్ల ఐ-వీటెక్ ఇంజిన్ కలిగి ఉన్నాయి. ఇందులో అదనంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ కూడా ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబీడీ, ఎయిర్ బ్యాగ్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ జత చేశారు.
మీరు ఒకవేళ హోండా జాజ్ కారు కొంటున్నారా.. అయితే రూ.25,947 వరకు సొమ్ము ఆదా చేయొచ్చు. ఇంఉదలో క్యాష్ డిస్కౌంట్ కింద రూ.5000 లేదా ఎఫ్‌వోసీ యాక్సెసరీస్ కింద రూ.5,947, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.5,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.7000తోపాటు కస్టమర్ లాయాల్టీ బోనస్ కింద మరో రూ.5000 డిస్కౌంట్ అందిస్తున్నది హోండా కార్స్.
హోండా డబ్ల్యూఆర్-వీ కారు కొంటున్నారా.. అయితే రూ.27 వేలు ఆదా చేసినట్లే. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేలు, లాయాల్టీ బోనస్‌గా రూ.5000, లాయాల్టీ ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.7000, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.5000 రాయితీ ఆఫర్ చేస్తున్నది హోండా కార్స్.
టాటా మోటార్స్ కస్టమర్లకు ఫేవరెట్ కారు టాటా హరియర్. పెర్ఫార్మెన్స్, డైనమిక్స్, లుక్స్‌లో కారు చాలా బాగుంటుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్తోపాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. హారియర్ కారుపై రూ.60 వేల డిస్కౌంట్ లభిస్తుంది. అందులో రూ.40 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.20 వేలు తగ్గిస్తున్నది.
టాటా హారియర్ తర్వాత భారీగా డిస్కౌంట్లు అందిస్తున్న కారు టాటా సఫారీ. గరిష్ఠంగా రూ.40 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది టాటా మోటార్స్. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.40 వేల డిస్కౌంట్ లభిస్తున్నది. అయితే, హారియర్ మాదిరిగా సఫారీపై కార్పొరేట్ డిస్కౌంట్ అమలు చేయడం లేదు.
టాటా మోటార్స్ చిన్న కార్ల జాబితాలో టియాగో ఒకటి. రూ.1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లభ్యం అవుతున్నది. సేఫ్టీ, కంఫర్ట్, ప్రాక్టికాలిటీ అంశాల్లో టియాగో చాలా మంచి కారు. దీనిపై టాటా మోటార్స్ రూ.31,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. ఎక్స్ఎం, ఎక్స్‌టీ వేరియంట్లపై రూ.21,500, ఎక్స్‌జడ్ మోడల్ కారుపై రూ.31,500 డిస్కౌంట్ అందిస్తున్నది.
టాటా టైగోర్పై గరిష్ఠంగా రూ.31,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. లోయెస్ట్ మోడల్ ఎక్స్ఈ, ఎక్స్ఎం వేరియంట్లపై రూ.21,500 డిస్కౌంట్ లభిస్తే, ఎక్స్‌జడ్ వేరియంట్‌పైన అదనంగా రూ.10 వేల రాయితీ లభిస్తుంది.
టాటా మోటార్స్ నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.6000 రాయితీ లభిస్తుంది. డీజిల్ వేరియంట్‌పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈవీ వర్షన్ నెక్సాన్‌పై ఎటువంటి డిస్కౌంట్లు లేవు. మహీంద్రా ఎక్స్‌యూవీ 300, కియా సొనెట్, హ్యుండాయ్ వెన్యూ, టయోటా అర్బన్ క్రూయిజర్, మారుతి సుజుకి వితారా బ్రెజా మోడల్ కార్లకు నెక్సాన్ గట్టి పోటీ ఇవ్వనున్నది.