JSW Group | ఎలక్ట్రిక్ కార్లు కొంటే.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బంఫర్ ఆఫర్.. ఎవరికంటే?!
JSW Group | విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తన ఉద్యోగులకు రూ.3 లక్షల ప్రోత్సాహాకాలివ్వనున్నది.

JSW Group | విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త సంవత్సరంలో అంటే 2022 జనవరి ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాహనాలు కొనే తమ సంస్థ ఉద్యోగులకు భారీగా.. రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపింది. గ్రీన్ అండ్ క్లీన్ మొబిలిటీ ప్రోత్సాహకంలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ.. నూతన ఎలక్ట్రిక్ వెహికల్స్ విధానాన్ని ఆవిష్కరించింది. ఉద్యోగుల కోసం భారత్ కార్పొరేట్ సంస్థ ఇటువంటి స్కీం ప్రకటించడం ఇదే తొలిసారి.
ఈ పథకం అమలు కోసం దీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి చెందిన దేశీయ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ (ఎన్డీసీఎస్) అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సినారియోస్ (Nationally Determined Contributions (NDCs) and Sustainable Development Scenarios (SDS) of The International Energy Agency (IEA) జత కట్టింది. ఈ పథకం అమలులో భాగంగా… విద్యుత్ ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసే జేఎస్‌డబ్ల్యూ ఉద్యోగులు… రూ. 3 లక్షల వరకు ప్రోత్సాహకాలు పొందొచ్చు.
జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు, ప్లాంట్లలోని ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లు కూడా కంపెనీ ఏర్పాటు చేయనుంది. 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తమ ఉద్యోగులు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఈ తోడ్పాటునందిస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా దేశంలో ఈవీ అడాప్షన్ పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

