Joyalukkas | హైదరాబాద్, నవంబర్ 20: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..వివాహ ఉత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా 10 గ్రాముల వెండి బార్‌ను అందిస్తున్నది. దీంతోపాటు డైమండ్లు, ఫ్రెషస్ స్టోన్లపై 25 శాతం తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు జోయాలుక్కాస్ ఎండీ, చైర్మన్ జాయ్ ఆలుక్కాస్ తెలిపారు.
ఈ ప్రత్యేక ఆఫర్లు డిసెంబర్ 1 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో లభించనున్నాయి.