హైదరాబాద్, మార్చి 9: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్…తెలుగు రాష్ర్టాల్లో భారీగా విస్తరించింది. కేవలం మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూంలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది.
ఈ నెల 12న వరంగల్లో తన రెండో షోరూంను ప్రారంభించబోతున్న సంస్థ..ఆ మరుసటి రోజు విజయనగరం, శ్రీకాకుళంలో సరికొత్త షోరూం ను, అలాగే ఈ నెల 14న గుంటూరులో రెండో షోరూంను ప్రారంభిస్తున్నట్టు జోయాలుక్కాస్ గ్రూపు చైర్మన్, ఎండీ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై 40 తగ్గింపు ఆఫర్ను అందిస్తున్నట్టు చెప్పారు.