స్టార్టప్‌ల్లో ఉద్యోగాల కోత
ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్‌లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్‌లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి.
- 23 వేల మందిని తీసేసిన 82 దేశీయ సంస్థలు
న్యూఢిల్లీ, మార్చి 25: ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్‌లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్‌లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి. కనీసంగా 82 దేశీయ స్టార్టప్‌లు 23 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు మీడియా సంస్థ ‘ఇన్స్42’ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీటిలో నాలుగు యూనికార్న్ స్టార్టప్‌లతో కలుపుకొని 19 ఎడ్యుటెక్ స్టార్టప్‌లు ఉండటం విశేషం. ఈ సంస్థలు 8,460 మందిపై వేటు వేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు తొలగించినట్లు తెలిపింది.
- గృహ ఇంటీరియర్, రెన్నోవేషన్ ప్లాట్‌ఫాం సేవల సంస్థ లీవ్స్పేస్..100 మందిని తొలగించినట్లు ప్రకటించింది.
- సాస్ ప్లాట్‌ఫాం కింద ఆన్లైన్ స్టోర్లు నిర్వహిస్తున్న దుకాణ్.. 30 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసింది. గడిచిన ఆరు నెలల్లో సిబ్బందిని తొలగించడం రెండోసారి.
- హెల్త్‌కేర్ యూనికార్న్ ప్రిైస్టెన్ కేర్.. 350 మందిని తొలగించింది.
- అప్‌గ్రాడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన క్యాంపస్‌లో 30 శాతం మందికి ఉద్వాసన పలికింది.
- గ్లోబల్ డెలివరీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం ఫార్ఐ..90 మందిని తొలగించింది.
ఉద్యోగులను తొలగించిన స్టార్టప్‌లు
- బైజూస్
- ఓలా
- ఓయో
- మీషో
- ఎంపీఎల్
- లైవ్స్పేస్
- ఇన్నోవాసర్
- ఉడాన్
- అన్అకాడమీ
- వేదాంతు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

