JioPhone 5G | కస్టమర్లకు తక్కువ ధరకే 4జీ సేవలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. అందరికీ అందుబాటు ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తామని ఇటీవల ప్రకటించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పని చేస్తామని పది నెలల క్రితం ప్రకటించినా.. ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేదు. కానీ ఇటీవల ఓ నెటిజన్.. ఇదే త్వరలో వినియోగదారుల దరి చేరనున్న జియో ఫోన్ నెక్ట్స్ 5జీ అంటూ డిజైన్, జియోఫోన్ 5జీ స్పెషికేషన్లు ట్విట్టర్ వేదికగా లీక్ చేశారు.
గూగుల్‌తో కలిసి జియో ఫోన్ 5జీ డెవలప్ చేస్తున్నదీ, లేనిదీ క్లారిటీ ఇవ్వలేదు. 2021లో గూగుల్ భాగస్వామ్యంతో కలిసి అందరికీ అందుబాటు ధరలో 4జీ స్మార్ట్ ఫోన్.. జియో ఫోన్ నెక్ట్స్ ఆవిష్కరించింది.
గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న జియో ఫోన్ 5జీ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నదని, 13 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా సెన్సర్ తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ విత్ 5-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుందని సదరు నెటిజన్ పేర్కొన్నారు. యూనిసోక్ 5జీ చిప్ సెట్ లేదా డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
Exclusive!!🔥Here's a sneak-peek at the upcoming unreleased JioPhone 5G.
The phone is expected to release between Diwali and New Year. The expected price is under ₹10k.
Not much specs known but possibly a Unisoc 5G or a Dimensity 700 processor.
13+2MP Rear
5MP Front camera. pic.twitter.com/bzRRIH8Sdn— Arpit 'Satya Prakash' Patel (@ArpitNahiMila) June 22, 2023
జియో 5జీ ఫోన్ ధర రూ.8000-12,000 మధ్య ఉండొచ్చునని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. స్నాప్ డ్రాగన్ 4800 ప్రాసెసర్, 4జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేతోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల సపోర్ట్ తో రావచ్చునని పేర్కొంది.
వచ్చే దీపావళి పండుగకు గానీ, నూతన సంవత్సరాది సందర్భంగా గానీ రిలయన్స్ జియో తన 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించవచ్చునని తెలిపారు ఆ నెటిజన్. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉండొచ్చునని అంచనా. ఫోన్ మరింత చౌకగా అందుబాటులోకి జియో పలు ప్లాన్లు ప్రకటించే అవకాశం ఉంది. కానీ, జియో తన 5జీ ఫోన్ డిజైన్, ఫీచర్లు స్వయంగా ప్రకటిస్తే గానీ, ఆ ఫోన్ ఇలాగే ఉంటుందా.. మార్పులు ఉంటాయా? అన్న సందేహాలు పరిష్కారం కావు.
భారత్‌లో బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్ పోటాపోటీగా ఉంటుంది. షియోమీ, ఒప్పో, వివో వంటి చైనా స్మార్ట్ ఫోన్లదే బడ్జెట్ సెగ్మెంట్లో ఆధిపత్యం. గతేడాది జూన్ నాటికి భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీలదే 79 శాతం వాటా. జియో 5జీ స్మార్ట్ ఫోన్ వస్తే.. భారత్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్లో గట్టి పోటీ ఉండొచ్చునని భావిస్తున్నారు.