Jio Recharge Plan | దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ జియోతోపాటు ఇతర కంపెనీలను ట్రాయ్ కాలింగ్, ఎస్ఎంఎస్లతో కూడిన చౌక ప్లాన్ అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జియో కాలింగ్, ఎస్ఎంఎస్తో రెండు చౌక ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. ఇందులో యూజర్లు 365 రోజుల వరకు దీర్ఘకాలిక వ్యాలిడిటీ చెల్లుబాటవుతుంది.
డేటాను ఎక్కువగా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జియో ఈ ప్లాన్‌ను కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించి.. డేటా అవసరం లేని యూజర్ల కోసం పరిచయం చేసింది. జియో ఒకటి రూ.458 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ రానుండగా.. రూ.1958 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో యూజర్లు చాలా ప్రయోజనాలుంటాయి.
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు అపరిమిత కాలింగ్, వెయ్యి ఉచిత ఎస్ఎంఎస్లను పొందుతారు. దాంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్లు ఎక్కువగా ఉపయోగించే వారిని ఉద్దేశించి మాత్రమే తీసుకువచ్చినట్లు జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో భారతదేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం ఉంటుంది.
జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల పాటు దీర్ఘకాలిక వ్యాలిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. 3600 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత నేషనల్ రోమింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. తద్వారా వినియోగదారులు పూర్తి వినోదాన్ని ఆస్వాదించొచ్చు.
ఇదిలా ఉండగా.. జియో ఇప్పుడు పాత రీఛార్జ్ ప్లాన్లను జాబితా నుంచి తొలగించింది. రూ.479, రూ.1899.. రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24GB డేటాను అందించనుండగా.. రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6జీబీ డేటాను ఈ ప్లాన్ అందించింది.
Read Also :
Bank Holidays | పనులుంటే చక్కబెట్టుకోండి..! ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్..!
UPS | యూపీఎస్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 1 నుంచి ఆ ఉద్యోగులకు ప్రయోజనాలు
Postal Schemes | తపాలా పథకాలు భళా.. వడ్డీయే కాదు ఇతర ప్రయోజనాలు కూడా