Bank Holidays | పనులుంటే చక్కబెట్టుకోండి..! ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్..!
Bank Holidays | కొత్త సంవత్సరమైన 2025లో మరో నెల కొద్దిరోజుల్లోనే ముగిసిపోనున్నది. ఫిబ్రవరి మాసం మొదలు కానున్నది. ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే.
Bank Holidays | కొత్త సంవత్సరమైన 2025లో మరో నెల కొద్దిరోజుల్లోనే ముగిసిపోనున్నది. ఫిబ్రవరి మాసం మొదలు కానున్నది. ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు.
అయితే, ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి ? ఎప్పుడు సెలవులుంటాయో తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని ఫిబ్రవరిలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి.బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు 24గంటలు పని చేస్తూనే ఉంటాయి.
వీటితో డబ్బులు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఇక నగదును తీసుకునేందుకు ఏటీఎంలు సైతం అందుబాటులో ఉంటాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ మిషన్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చాయి. దాంతో డబ్బులను ఖాతాల్లో జమ చేసుకునేందుకు వీలుంది. పలు సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. ఆ సమయంలో బ్యాంకులకు సంబంధించిన సెలవుల సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులన్నీ చక్కబెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.
ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే..
ఫిబ్రవరి 2 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 3 : సరస్వతి పూజ సందర్భంగా అగర్తలలో బ్యాంకులకు హాలీడే.
ఫిబ్రవరి 8 : రెండో శనివారం సందర్భంగా సెలవు.
ఫిబ్రవరి 9 : ఆదివారం సందర్భంగా హాలీడే.
ఫిబ్రవరి 11 : థై పోసమ్ సందర్భంగా చెన్నైలో మూసివేత.
ఫిబ్రవరి 12 : శ్రీరవిదాస్ జయంతి నేపథ్యంలో షిమ్లాలో సెలవు.
ఫిబ్రవరి 15 : లుయ్ గై ని పండుగ సందర్భంగా ఇంఫాల్‌లో హాలీడే.
ఫిబ్రవరి 16 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్
ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ముంబయి, నాగ్‌పూర్‌లో సెలవు.
ఫిబ్రవరి 20 : స్టేట్హుడ్ డే సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్ ఈటానగర్‌లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం కావడంతో బ్యాంక్‌లకు సెలవు.
ఫిబ్రవరి 23 : ఆదివారం బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు.
ఫిబ్రవరి 28 : లోసర్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలకు హాలీడే.
Read Also :
UPS | యూపీఎస్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 1 నుంచి ఆ ఉద్యోగులకు ప్రయోజనాలు
Gold | పెరుగుతున్న బంగారం ధరలు.. మారుతున్న ట్రెండ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

