న్యూఢిల్లీ, జూలై 29 : టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. సబ్స్క్రిప్షన్ ఆధారంగా పర్సనల్ కంప్యూటర్ సేవలను ప్రారంభించింది. ఇక నుంచి పర్సనల్ కంప్యూటర్లోనూ టీవీని తిలకించవచ్చును. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ఆధారంగా రూ.599 ప్రారంభ ధరతో నెలవారీ ప్లాన్‌ను, దీనికి జీఎస్టీ అదనమని వెల్లడించింది. అలాగే వార్షిక ప్లాన్‌ను రూ.4,599గా నిర్ణయించింది.
దీనికి కూడా జీఎస్టీ అదనంగా చెల్లించాల్సివుంటుంది. అంటే నెలకు రూ.383 చెల్లిస్తే సరిపోతున్నదన్న మాట. ఒకే ప్లాన్‌కింద పీసీ సర్వీసులు, జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ సేవలు పొందవచ్చును. 8జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ సేవలకుగాను సబ్‌స్ర్కైబర్లు..కీబోర్డ్, మౌస్‌ని తీసుకోవాల్సివుంటుంది.