100 నిమిషాల్లో ఊదిపారేశారు
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జియో ఐపీవో రికార్డులు నమోదయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.30,213 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా బుధవారం మొదలైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయిపోవడం విశేషం. భారత్‌లో ఓ ఐపీవో ఇంత త్వరగా సబ్‌స్ర్కైబ్ కావడం ఇదే తొలిసారి. అంతేగాక ఇదే దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డుకెక్కింది.
- జియో రికార్డుల జాతర
- మెగా ఐపీవోకు విశేష స్పందన
- మొదటి రోజే 3.16 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
- రూ.30,213 కోట్లకుగాను రూ.69,800 కోట్ల బిడ్లు దాఖలు
- దేశీయ స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జియో ఐపీవో రికార్డులు నమోదయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.30,213 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా బుధవారం మొదలైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయిపోవడం విశేషం. భారత్‌లో ఓ ఐపీవో ఇంత త్వరగా సబ్‌స్ర్కైబ్ కావడం ఇదే తొలిసారి. అంతేగాక ఇదే దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డుకెక్కింది.
ఇక స్టాక్ ఎక్సేంజీల వివరాల ప్రకారం ఈ ఇష్యూలో 19.75 కోట్ల షేర్లు ఆఫర్‌కు రాగా.. సాయంత్రం 5 గంటలదాకా 62.36 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు మదుపర్ల నుంచి వచ్చాయి. దీంతో 3.16 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగినట్టు తేలింది. గరిష్ఠ షేర్ ధర రూ.1,119తో లెక్కిస్తే.. ఈ పబ్లిక్ బిడ్ల విలువ దాదాపు రూ.69,800 కోట్లుగా ఉన్నది. రిటైల్ ఇన్వెస్టర్ల విషయానికొస్తే.. 8.50 కోట్ల షేర్లు వీరి కోసం కేటాయించారు. తొలి రోజు 6.18 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. 0.73 శాతం సబ్స్క్రిప్షన్ దక్కింది. మొదటి రోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఈ పెద్ద స్థాయిలో స్పందన రావడం భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే ఓ రికార్డు.
పోటెత్తిన యాంకర్ ఇన్వెస్టర్లు
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనే వచ్చింది. దాదాపు రూ.8,110 కోట్ల షేర్లు వీరి కోసం కేటాయిస్తే.. ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకుపైగా బిడ్లు దాఖలైనట్టు తెలుస్తున్నది. దీంతో ఈ ఐపీవోలో ఇప్పటిదాకా రూ.3.20 లక్షల కోట్ల విలువైన షేర్లకు డిమాండ్ వచ్చినైట్టెంది. సోమవారమే యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరుగగా.. 212 మంది పోటీపడ్డారు. గ్లోబల్ అసెట్ మేనేజర్లు, సావరిన్ వెల్త్ ఫండ్లు, భారతీయ మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరర్లు, పెన్షన్ ఫండ్లు.. ఈ యాంకర్ బుక్‌లో పాల్గొన్నట్టు సమాచారం.
అయితే కొందరు బడా విదేశీ ఇన్వెస్టర్లు, ఇంకొన్ని భారతీయ కంపెనీలు 750 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకుపైగా విలువైన షేర్ల కోసం బిడ్లు వేశాయని అంటున్నారు. చాలావరకు టైర్-1 ఫండ్స్.. తమకు గరిష్ఠంగా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు షేర్లు అందుతాయని ఆశిస్తున్నాయి. అలాగే కనిష్ఠంగా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయింపులు జరుగవచ్చని చెప్తున్నారు. షేర్ ధరల శ్రేణి రూ.1,065-1,199తో వచ్చిన ఈ పబ్లిక్ ఇష్యూ.. శుక్రవారం ముగియనున్నది. వచ్చే బుధవారం (అక్టోబర్ 28న) స్టాక్ మార్కెట్లలో నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి.
జియోకు ముందు..
దేశీయంగా ఐపీవోల చరిత్రలో అత్యంత వేగంగా సబ్‌స్ర్కైబ్ అయిపోయిన పబ్లిక్ ఇష్యూగా జియో రికార్డు సృష్టించింది. అయితే అంతకుముందు కూడా కొన్ని బడా ఐపీవోలు గంటల వ్యవధిలోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయిపోయాయి. వాటిలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ముందున్నది. ఐపీవో ప్రారంభమైన తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి మొత్తంగా సబ్‌స్కైబ్ అయ్యింది. అలాగే గత ఏడాది వచ్చిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీవో మొదటిరోజే సబ్‌స్ర్కైబ్ అయ్యింది. ఇదిలావుంటే ఇప్పటిదాకా దేశీయ అతిపెద్ద ఐపీవోగా ఉన్న హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ తొలిరోజు 18 శాతం మాత్రమే సబ్‌స్ర్కైబ్ అయ్యింది. 2024లో రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఐపీవో వచ్చిన సంగతి విదితమే.
- జియో ఉద్యోగుల కోటా 1.37 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
- 1.46 రెట్లు అధికంగా బిడ్డింగ్ వేసిన వాటాదారులు
- 1.68 రెట్లు ఎక్కువగా బిడ్ చేసిన సంస్థాగతేతర మదుపర్లు
- 9.42 రెట్లు ఓవర్‌గా సబ్‌స్ర్కైబ్ చేసిన క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులు
- 4.90 కోట్ల షేర్లకుగాను 46.15 కోట్ల షేర్లకు సరిపడా బిడ్డింగ్
- 3.19 కోట్ల షేర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్ బిడ్
- 15.14 కోట్ల షేర్లను కోరుతున్న విదేశీ సంస్థాగత మదుపర్లు
- బ్యాంకింగ్, బీమా సహా దేశీయ ఆర్థిక సంస్థల నుంచి 25.02 కోట్ల షేర్లకు డిమాండ్
- ఈ పబ్లిక్ ఇష్యూలో 27 కోట్లదాకా కొత్త షేర్లు జారీ చేసిన జియో
- జియో ప్లాట్‌ఫామ్స్ విలువ దాదాపు 108 బిలియన్ డాలర్లుగా లెక్క

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

