న్యూఢిల్లీ, అక్టోబర్ 29: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్(జేపీఎస్‌ఎల్) భారీ ఊరట లభించింది. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగ్రేటర్ లైసెన్స్‌ను రిజర్వుబ్యాంక్ నుంచి పొందింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 చట్టం ప్రకారం జేపీఎస్ఎల్కు అనుమతినిచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ నెల 28 నుంచి ఈ అగ్రిగ్రేటర్ సేవలను ప్రారంభించినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది.