ముంబై, ఆగస్టు 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో విడిపోయిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం అటు బీఎస్ఈతోపాటు ఎన్ఎస్ఈలోనూ లిస్ట్ కానున్నది.
ఈ విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నికర విలువ రూ.1.66 లక్షల కోట్లుగా నిర్ణయించింది. దీంతో దేశంలో రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీగా, విలువ పరంగా చూస్తే 32వ అతిపెద్ద సంస్థ ఇదే కావడం విశేషం. టాటా స్టీల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఎస్బీఐ లైఫ్ కంటే పెద్దది.