న్యూఢిల్లీ, మే 7: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. మార్చి నెలలోనూ 21.74 లక్షల మంది జియో నెట్వర్క్ పరిధిలోకి చేరడంతో మొత్తం సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారని టెలికం నియంత్రణ మండటి ట్రాయ్ వెల్లడించింది.
అలాగే భారతీ ఎయిర్టెల్ పరిధిలోకి 12.50 లక్షల మంది చేరడంతో మొత్తం సంఖ్య 38.98 కోట్లకు చేరుకున్నారు. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 5.41 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ కస్టమర్ల సంఖ్య 20.53 కోట్లకు పడిపోయారు.