Jio 5G Data Plan | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం కంపెనీ జియో (Jio) తన కస్టమర్ల కోసం అసాధారణమైన కేర్ తీసుకుంటున్నది. ఇందుకోసం సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ 5జీ డేటా వినియోగానికి వీలుగా రూ.601తో ‘అన్ లిమిటెడ్ 5జీ అప్ గ్రేడ్’ ఓచర్ తెచ్చింది. 4జీ యూజర్లు కూడా ఈ ఓచర్ సాయంతో 5జీ సేవలు పొందొచ్చు. దీన్ని మై జియో యాప్ లోనే కొనుగోలు చేసి యాప్ లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఈ ఓచర్ స్నేహితులకు గిఫ్ట్ మాదిరిగా పంపుకోవచ్చునని జియో తెలిపింది.
యూజర్లకు 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్ వర్క్ గల వారికి వెల్ కం ఆఫర్ కింద ఫ్రీ 5జీ డేటా అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీచార్జీ చేసుకున్న వారికి ఈ సౌకర్యం కల్పించింది. రోజువారీగా 2 జీబీ డేటా ప్లాన్ రీచార్జీ చేసుకున్న వారికి అపరిమిత 5జీ డేటా ఆఫర్ చేస్తోంది. అంటే ప్రతి నెలా రూ.349 ప్లాన్ రీ చార్జి చేసుకున్న వారికి మాత్రమే జియో ఉచితంగా 5జీ డేటా అందిస్తుందన్న మాట.