హైదరాబాద్, జనవరి 24:దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో… రాష్ట్రంలో మరో నగరంలో 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఈ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా నల్లగొండలో మంగళవారం ప్రారంభించింది. జియో వెల్కమ్ ఆఫర్ కింద అన్లిమిటెడ్ డాటాను 1జీబీపీఎస్ ప్లస్ వేగంతో ఈ సరికొత్త సేవలను అందిస్తున్నది. ఇందుకోసం కస్టమర్ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు17 రాష్ర్టాల్లో 50 నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. దీంతో 5జీ సేవలు అందిస్తున్న నగరాల సంఖ్య 184కి చేరుకున్నది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే తన సేవలను విస్తరిస్తున్నది.