మహీంద్రా గ్రూపునకు చెందిన ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్ జావా మరో మూడు మాడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. జావా 42 ఎఫ్‌జే పేరుతో విడుదల చేసిన ఈ మోటార్‌సైకిళ్లు రూ.1.99 లక్షల నుంచి రూ.2.20 లక్షల లోపు లభించనున్నాయి.
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ప్రీమియం మోటార్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, దీంతో తమ బ్రాండ్ మరింత బలోపేతం కానున్నదన్నారు.
ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్..జావా బ్రాండ్‌తో భారత్‌తోపాటు తూర్పు ఆసియా దేశాల్లో బైకులను విక్రయిస్తున్నది.