కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐటీసీ (ITC) లిమిటెడ్.. సిగరెట్ల నుంచి హోటల్ బిజినెస్ వరకు రకరకాల బిజినెస్‌లు చేస్తున్న పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది ఐటీ షేర్ విలువ రికార్డు స్థాయిలో 21 శాతం పెరగడంతో రూ.5 లక్షల కోట్ల ఎం-క్యాప్ మైలురాయిని చేరుకున్న 11వ కంపెనీగా నిలిచింది.
గురువారం బీఎస్ఈ అంతర్గత ట్రేడింగ్‌లో ఐటీసీ షేర్ విలువ 1.1 శాతం పెరిగి రూ.402.60 వద్ద రికార్డు నమోదు చేసింది. ఈ సమయంలో ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.01 లక్షల కోట్లుగా రికార్డయింది. ఇప్పటి వరకు ఈ మైలు రాయి సాధించిన సంస్థల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
ఎఫ్ఎంసీజీ మొదలు కాగితం నుంచి హోటల్స్ వరకు పలు క్యాటగిరీల్లో ఐటీసీ మెరుగైన వృద్ధి రిజిస్టర్ చేస్తుండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ కొనుగోలుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితి. గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా సేల్స్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నా ఐటీసీ రాణిస్తుండటం ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కారణం అని చెప్పారు.