న్యూఢిలీ మే 22 : దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ..షేరు హోల్డర్లకు బొనాంజాను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతీషేరుకు రూ.7.85 లేదా 785 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది.
వచ్చే నెలలో ఇందుకు సంబంధించి వాటాదారులకు చెల్లింపులు జరపనున్నట్టు తెలిపింది. మరోవైపు, గడిచిన త్రైమాసికానికిగాను రూ.20, 376.3 కోట్ల ఆదాయంపై రూ.19,807.8 కోట్ల నికర లాభాన్ని గడించింది.