టెకీలకు గుడ్‌న్యూస్ : ఐటీలో 1,38,000 తాజా కొలువులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో క్యాంపస్ ప్లేస్మెంట్లు లేక, నియామకాలు తగ్గిన పరిస్థితులను అధిగమించి భారత ఐటీ రంగం నిలదొక్కుకుంది. కొవిడ్ మహమ్మారితో ప్రపంచ ఐటీ రంగం 3.2 శాతం మేర కుదేలవుతుందనే అంచనాల నడుమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ పరిశ్రమ 2.3 శాతం వృద్ధి రేటు కనబరిచి సత్తా చాటనుందని సాఫ్ట్వేర్ సర్వీసుల కంపెనీలతో కూడిన నాస్కామ్ అంచనా వేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ద్వితీయార్ధంలో రికవరీతో ఐటీ రంగం సానుకూల వృద్ధిని సాధిస్తుందని నాస్కామ్ ‘న్యూ వరల్డ్ : ద ఫ్యూచర్ ఈజ్ వర్చువల్’ టైటిల్‌తో వెల్లడించిన రివ్యూలో పేర్కొంది.
2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగం ఆదాయం దాదాపు రూ 1౩ లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు శాతం అధికం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో 1,38,000 కొత్త ఐటీ కొలువులు వచ్చి చేరతాయని అంచనా వేసింది. 2020 కేలండర్ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తితో కష్టాలతో మొదలై పలు కంపెనీలకు ధరలు, కాంట్రాక్టులపై ఒత్తిళ్లు పెరిగినా 2021 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో భారీ రికవరీతో ఐటీ రంగం పుంజుకుందని నాస్కామ్ పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ కరోనా మహమ్మారితో కుదేలై ఇప్పట్లో కోలుకోలేదన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా మనం కోలుకున్నామని తెలిపింది.
తాజావార్తలు
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్‌షీట్