హైదరాబాద్, మే 2: సిగ్నిటీ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికి రూ. 424.97 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.49.24 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాదికిగాను రూ.1,647. 58 కోట్ల ఆదాయంపై రూ.168.32 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనికి అదనంగా రూ.2.50 అదనపు డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.