రెండో రోజూ డౌన్
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్లు తగ్గి 16,125 పాయింట్ల వద్ద నిలిచింది.
- ద్రవ్యోల్బణంపై భయాలు
- ఐటీ షేర్లలో అమ్మకాలు
- ఆటో మినహ అన్ని రంగాలకు నష్టాలు
- 236 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
న్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట్లు తగ్గి 16,125 పాయింట్ల వద్ద నిలిచింది. అధిక ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయని, రూపాయి బలహీనత, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు స్థానిక సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా ఫెడ్ మీటింగ్ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు దిశపై సంకేతాలు మినిట్స్‌లో వెల్లడైన తర్వాత కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవొచ్చని భావిస్తున్నారని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఆసియాలో హాంకాంగ్, షాంఘై, సియోల్, టోక్యో సూచీలు నష్టాలతో ముగిసాయి. అలాగే యూరప్ సైతం భారీగా తగ్గాయి.
టెక్ మహీంద్రా టాప్ లూజర్
ఇన్వెస్టర్లు తాజాగా ఐటీ షేర్లను అధికంగా విక్రయించారు. ఈ క్రమంలో బీఎస్ఈ-30 షేర్లలో అన్నింటికంటే అత్యధికంగా టెక్ మహీంద్రా 3.92 శాతం తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్‌లు 1-3 శాతం మధ్య పడిపోయాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎంలు 1.8 శాతం వరకూ పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ 1.75 శాతం నష్టపోగా, యుటిలిటీస్ సూచి 1.7 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.64 శాతం, పవర్ సూచి 1.64 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ సూచి 0.85 శాతం క్షీణించింది. ఇంధన ధరల తగ్గుదల, ఉక్కుపై ఎగుమతి సుంకాల్ని పెంచడంతో ఆటో రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయని, మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
భారత్ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం సైతం నికర విక్రయాలు జరిపారు. మంగళశారం వీరు రూ. 2,393 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రితం రోజు రూ. 1,951 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
రూ.624 కోట్ల జీఎంఆర్ షేర్ల విక్రయం
మారిషస్‌కు చెందిన డీవీఐ ఫండ్ మంగళవారం రూ. 624 కోట్ల విలువైన జీఎంఆర్ ఇన్ఫ్రా షేర్లను విక్రయించింది. షేరుకు రూ.36.65 సగటు ధరతో 17.03 కోట్ల షేర్లను రెండు బ్లాక్ డీల్స్‌గా అమ్మినట్టు ఎన్ఎస్ఈ డాటా వెల్లడిస్తున్నది. ఈ లావాదేవీ విలువ రూ. 624.38 కోట్లు. ఈ షేర్లను ఏడీ ఇన్వెస్టర్స్ ఫండ్, సీడీ ఇన్వెస్టర్స్ ఫండ్, డెక్కన్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఫండ్, డీవీజీ 1740 ఫండ్ కొనుగోలు చేశాయి. జీఎంఆర్ ఇన్ఫ్రాలో 2021 డిసెంబర్ చివరినాటికి డీవీఐ ఫండ్ మారిషస్‌కు 7.76 శాతం వాటా ఉంది. తాజా బ్లాక్ డీల్స్ నేపథ్యంలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు రూ. 37.30 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

