న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఒక్క శాతం పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలలో ధరల పెంపులో మార్పులు చోటుచేసుకోనున్నాయి.