శేరిలింగంపల్లి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ)… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఏపీఐటీఏ)లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా సంయుక్తంగా సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నారు. హైదరాబాద్లోని ఐఎస్బీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయా సంస్థల అధికారులు పరస్పరం అవగాహాన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. వీరిలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మధన్ పిల్లుట్ల, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కే అజయ్ రెడ్డి, ఏపీఐటీఏ సీఈవో టీ అనిల్ కుమార్, డిప్యూటీ డీన్ దీపామణిలు ఉన్నారు.