న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచింది. ఖనిజ ఉత్పత్తిలో 10 శాతం పెరిగి 45 మిలియన్ టన్నులకు చేరుకోగా, అమ్మకాలు 16 శాతం అధికమై 44.48 మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.
2022-23లో 257 మిలియన్ టన్నులు ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ..ఆ మరుసటిఏడాది 275 మిలియన్ టన్నులకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు.