న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.294.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్సీటీసీ. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.226.03 కోట్లతో పోలిస్తే ఇది 30.36 శాతం అధికమని పేర్కొంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23.51 శాతం ఎగబాకి రూ.995.31 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) వెల్లడించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు ప్రస్తుత సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.