ఐటీ ఆదాయ వృద్ధి 3 శాతమే
భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇక్రా అంచనా
న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే ఐటీ కంపెనీల లాభదాయకత కూడా నెమ్మదిస్తుందని, నిర్వహణా లాభాల మార్జిన్ 1 శాతం తగ్గుదలతో 20-21 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. ఐటీ సేవలకు డిమాండ్ మందగిస్తున్నందున 2023-24లో ఐటీ కంపెనీల టర్నోవర్ వృద్ధి 3-5 శాతానికి పడిపోతుందని ఇక్రా ఐటీ రంగ హెడ్ దీపక్ జొత్వాని తెలిపారు. ఇక్రా రిపోర్ట్ వివరాలు&
- సాఫ్ట్వేర్ సర్వీసులకు కీలక మార్కెట్లయిన ఉత్తర అమెరికా, యూరప్‌ల్లో అనిశ్చితి కొనసాగుతున్నందున, అత్యవసరంకాని ప్రాజెక్టుల్ని కార్పొరేట్లు వాయిదా వేసుకుంటాయి.
- కీలక మార్కెట్లయిన యూఎస్, యూరప్‌ల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా నిరుడు క్యూ3, ఈ ఏడాది క్యూ1 మధ్య ఐటీ కంపెనీల వృద్ధి గణనీయంగా తగ్గింది.
- తాజాగా ముగిసిన క్యూ1లో 3.8 శాతం ఆదాయ వృద్ధిని మాత్రమే నమోదయ్యింది. గత 10 త్రైమాసికాల్లో ఇదే కనిష్ఠ వృద్ధి.
- వృద్ధి మందగించడంతో గత మూడు త్రైమాసికాల్లో ఐటీ కంపెనీలు నియామకాల్ని తగ్గించాయి. సమీప భవిష్యత్‌లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది.
- వచ్చే కొద్ది త్రైమాసికాల్లో వలసల రేటు దీర్ఘకాలిక సగటు 13-15 శాతానికి తగ్గుతుంది.
- యూరప్‌తో పోలిస్తే యూఎస్ నుంచి ఆదాయాలు బాగా తగ్గాయి. ఇతర రంగాలతో పోలిస్తే బీఎఫ్ఎస్ఐ, కమ్యూనికేషన్ల నుంచి ఆదాయం మందగించింది.
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ తదితర కీలక రంగా లు ఐటీ వ్యయాల్ని తగ్గించుకుంటాయి.
- ఐటీ కంపెనీలు నిర్వహణా వ్యయాల్ని అదుపుచేసుకుంటున్నందున, ఆదాయ వృద్ధి తగ్గుదల ప్రభావం లాభదాయకత మీద పడకుండా చూసుకుంటాయి.
- ఆన్‌షోర్-ఆఫ్‌షోర్ మిక్స్ పాటించడం, ఉద్యోగి వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠపర్చుకోవడం ద్వారా పలు కంపెనీలు ఈ మందగమనాన్ని అధిగమిస్తాయి.
- కంపెనీల వద్దనున్న ఆర్డర్లు ఆదాయంగా మారడం తగ్గినప్పటికీ, పలు కంపెనీల ఆర్డర్ బుక్, డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉంది.
- ఆదాయం తగ్గినా మెజారిటీ ఐటీ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ బలంగానే ఉంటాయి. క్యాష్ ఫ్లో బాగుండటం, రుణాలు తక్కువగా ఉండటం, పటిష్టమైన లిక్విడిటీ ఇందుకు కారణం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడి, ఐటీ వృద్ధి తిరిగి జోరు అందుకుంటుందని ఇక్రా అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

