iQOO Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 31న ఆవిష్కరిస్తామని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఐక్యూ (iQOO) వెల్లడించింది. ఐక్యూ జడ్7ప్రో 5జీ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లపై ఐక్యూ (iQOO)తోపాటు అమెజాన్ ఇండియా.. తమ వెబ్సైట్లలో వేర్వేరుగా మైక్రో సైట్ క్రియేట్ చేశాయి. ఈ ఫోన్ ధర రూ.25,000-30,000 మధ్య ఉండొచ్చునని అంచనా. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.
6.78-అంగుళాల కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అండ్ యాంటీ గ్లేర్ కలిగి ఉంటుంది ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) ఫోన్. 8జీబీ రామ్, 12 జీబీ రామ్‌తోపాటు 128 జీబీ అండ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా వస్తున్నది. 4ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఐక్యూ జడ్7 ప్రో5జీ (iQOO Z7 Pro 5G) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుందని సమాచారం. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉండొచ్చు. 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.