పోచంపల్లి పీహెచ్సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి డాక్టర్ మెడలో ఉన్న స్టెతస్కోప్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు పరారైన ఘటన గురువారం భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిబ్లక్‌పల్లి పల్లె దావఖాన డాక్టర్ శ్వేత గురువారం...
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 01 : డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి డాక్టర్ మెడలో ఉన్న స్టెతస్కోప్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు పరారైన ఘటన గురువారం భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిబ్లక్‌పల్లి పల్లె దావఖాన డాక్టర్ శ్వేత గురువారం విధులు నిర్వహిస్తున్నారు. పోచంపల్లి గ్రామానికి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయం కావడంతో చికిత్స చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్ శ్వేత వద్దకు తిరుపతి వచ్చి కాలును చూపించడంతో కాలుకు పట్టి వేసి మందులు రాసిచ్చారు. కొద్దిసేపు తర్వాత తిరుపతి అనుచితంగా ప్రవర్తించి అకారణంగా డాక్టర్ పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని విధుల్లో ఉన్న మరో ఇద్దరి మహిళా సిబ్బందిపై దాడి చేసి దుర్భాషలాడాడు.
మహిళా వైద్యాధికారిణిపై దుండగుడు దాడికి పాల్పడాటాన్ని నిరసిస్తూ వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పీహెచ్సీ వద్ద పోలీసులు రక్షణ కల్పించాలని, నిందితుడిపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని సమాచారం.

పోచంపల్లి పీహెచ్సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

