iQoo Neo 9 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo).. తన ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ భారత్‌లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ (Qual comm Snapdragon 8 Gen 2 SoC) చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. వచ్చేనెల 22న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది ఐక్యూ.
ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ డ్యుయల్ టోన్ రెడ్ అండ్ వైట్ డిజైన్, లెదర్ ఫినిష్, డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. చైనా మార్కెట్లో ఐక్యూ నియో9 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.35 వేల (2999 చైనా యువాన్లు)కు లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ విక్రయిస్తారు. భారత్ లో రూ.40 వేల లోపు ధరకే అందుబాటులో ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
ఐక్యూ నియో9 ప్రో ఫోన్ (iQoo Neo 9 Pro) ఆండ్రాయిడ్ 14-బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 ( Android 14-based Funtouch OS 14) వర్షన్‌పై పని చేస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5కే రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్920 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరాతో వస్తుంది. 120 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.