iQoo Neo 7 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo).. భారత్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ ఫోన్ ఐక్యూ నియో 7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) ఆవిష్కరించింది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం ఎనిమిది నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) ఫోన్ బేస్ విత్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.34,999, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ టాప్ వేరియంట్ రూ.37,999లకు లభిస్తాయి.
ఐక్యూ నియో 7 ప్రో (iQoo Neo 7 Pro 5G) ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ డిస్ ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజొల్యూషన్ కలిగి ఉంటది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ వర్షన్ తో పని చేస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా 50 మెగా పిక్సెల్ – 8 ఎంపీ – 2 ఎంపీ లెన్స్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం పంచ్ హోల్ డిజైన్‌తో 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో 8 నిమిషాల్లో 50 శాతం, 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ విత్ 5జీ, వై-ఫై 5.3, జీపీఎస్, బ్లూ టూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ ఫోన్ ఈనెల 15 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ వెబ్సైట్లోనూ లభిస్తుంది. ఈ నెల 15-18 మధ్య కొనుగోలు చేసిన వారికి యుట్లీ బర్డ్ డిస్కౌంట్ కింద రెండు వేరియంట్లపై రూ.1000 చొప్పున లభిస్తుంది. అంతే కాదు ఎస్బీఐ / ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారు అదనంగా రూ.2000 డిస్కౌంట్ అందుకోవచ్చు. ఐక్యూ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.3000, ఇతర పాత ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2000 రాయితీ లభిస్తుంది.