iQOO 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ప్రీమియం ఫోన్ ఐక్యూ 13 (iQoo13) ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ ప్లే తో వస్తుందని భావిస్తు్న్నారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఐక్యూ 13 ఫోన్ 6150 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. డిసెంబర్ నెలలో ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.55 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఐక్యూ 13 (iQoo 13) ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 2కే రిజొల్యూషన్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటదని సమాచారం. వాటిలో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
ఐక్యూ 13 (iQoo 13) ఫోన్ సెక్యూరిటీ కోసం ఆల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని సమాచారం. మెటల్ మిడిల్ ప్రేమ్, 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6150 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. గతేడాది డిసెంబర్ లో ఐక్యూ తన ఐక్యూ12 ప్రో ఫోన్ తోపాటు ఐక్యూ 12 ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. దాని కొనసాగింపుగా ఐక్యూ 13 ఫోన్ వస్తుందని భావిస్తున్నారు.