IPL 2024 | ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో రిలయన్స్, ఎయిర్టెల్ తమ యూజర్లకు అపరిమిత 5జీ డేటా ప్లాన్లు అందుబాటులోకి తెచ్చాయి. అయితే యూజర్లు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎయిర్ టెల్ 5జీ ప్లస్ నెట్ వర్క్, రిలయన్స్ జియో ట్రూ 5జీ సర్వీసెస్ అందుబాటులో ఉండటంతోపాటు వారు 5జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. 2022 అక్టోబర్ నుంచి రెండు కంపెనీలు చురుగ్గా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. రూ.239తో అపరిమితమైన 5జీ డేటా అందిస్తున్నది. రూ.500 ప్లాన్ కింద వివిధ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చాయి.
అపరిమిత 5జీ డేటా అందిస్తున్న ఎయిర్ టెల్ అత్యంత చౌక ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ కింద అపరిమిత ఫోన్ కాల్స్, 200 జీబీ డేటా, రోజుకు ఒక జీబీ డేటా లేదా 100 ఎస్ఎంఎస్ లు పంపొచ్చు. ఈ ప్లాన్ 24 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
జియో అందిస్తున్న అత్యంత చౌక ప్లాన్ రూ.239. 28 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు.
* రూ.265తో 28 రోజులు చెల్లుబాటయ్యే ఎయిర్ టెల్ ప్లాన్ లో రోజుకు ఒక జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు.
* 23 రోజుల చెల్లుబాటుతో కూడిన రిలయన్స్ జియో రూ.249 ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, అపరిమితమైన 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పంపొచ్చు.
* 30 రోజుల చెల్లుబాటయ్యే రూ.295 ప్లాన్ కింద ఎయిర్ టెల్ రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్, అపరిమిత 5జీ డేటాతోపాటు 25జీబీ డేటా పొందొచ్చు.
* రూ.259 ప్లాన్ కింద రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ 5జీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 1.5 జీబీ 4జీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్లు పంపొచ్చు.
* 28 రోజుల చెల్లుబాటయ్యే ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, అపరిమిత 5జీ డేటా, రోజూ 1.5 జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పంపొచ్చు.
* 28 రోజుల వ్యాలిడిటీ గల రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ కింద రోజూ 2జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు.
* నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన ఎయిర్ టెల్ రూ.359 ప్లాన్ కింద రోజూ 2జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. అపరిమిత కాల్స్, అపరిమిత 5జీ సేవలు లభ్యం.
* రూ.349 ప్లాన్ కింద రిలయన్స్ జియో నెల రోజులు అపరిమిత కాలింగ్, 5జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, రోజూ 3.5జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.
* రూ.399 ప్లాన్ కింద 28 రోజులు ఎయిర్ టెల్ రోజూ 2.5 జీబీ డేటా, అపరిమిత 5జీ, అపరిమిత కాలింగ్ ఫెసిలిటీ కల్పిస్తోంది.
* రూ.419 ప్లాన్ కింద 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, అపరిమిత 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, రోజూ 3జీబీ డేటా లభ్యం.
* రూ.455 ప్లాన్ కింద 84 రోజులు ఎయిర్ టెల్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5జీ డేటా అందిస్తుంది. 6జీబీ డేటాతోపాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లూ పంపొచ్చు.
* రూ.479 ప్లాన్ కింద 56 రోజులు చెల్లుబాటయ్యే ఎయిర్ టెల్ ప్లాన్ తో రోజూ 1.5 జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవడంతోపాటు అపరిమిత కాలింగ్, అపరిమిత 5జీ డేటా పొందొచ్చు.
* రూ.499 ప్లాన్ కింద 28 రోజులూ అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ డేటా, రోజూ 3జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పొచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న వారు మూడు నెలలపాటు డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.