iPhone 16 | ఆపిల్ కొత్తగా ఐఫోన్-16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ నెల 9న ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈ వెంట్లో 16 సిరీస్‌ను విడుదల చేసింది. త్వరలోనే కొత్త సిరీస్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ పాత సిరీస్‌కు చెందిన మోడల్స్ ధరలపై భారీగా తగ్గింపును ప్రకటించింది. పాత మోడల్స్‌పై రూ.10వేల వరకు తగ్గించింది. ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలను పెంచేందుకు ఆపిల్ పలు పాత ఐఫోన్స్ అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్-15, ఐఫోన్ 14 సిరీస్ ప్రస్తుతం ఆపిల్ స్టోర్ వెబ్సైట్లో రూ.10వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ 15 బేస్ మోడల్ 128 జీబీ వేరియంట్ ప్రస్తుతం రూ.69,900 ధరకే అందుబాటులో ఉన్నది. లాంచ్ సమయంలో ధర రూ.79,900గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక 256జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 కాగా, ఇంతకుముందు రూ.89,900గా ఉండేది. 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.99,900కి అందుబాటులో ఉండగా.. దీని ధర గతంలో రూ.1,09,900గా ఉన్నది.
అలాగే, ఐఫోన్ 14 బేస్ మోడల్ 128జీబీ స్టోరేజీ మోడల్ భారత్‌లో రూ.59,900 ధర ఉన్నది. గతంలో దీని ధర రూ.69,900గా ఉంది. 256జీబీ వేరియంట్ రూ.69,900.. ఇక 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.89,900కే అందుబాటులోకి ఉంచింది. 2022లో ఐఫోన్ 14 లాంచ్ అయిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ.79వేలుగా ఉన్నది. గతేడాది ఆపిల్ 15 సిరీస్ లాంచ్ తర్వాత 14 సిరీస్ ధరలను తగ్గించింది. ఆ తర్వాత పలు మోడల్స్‌ను నిలిపివేసింది. ఐఫోన్ 15 సిరీస్‌లో బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 బ్లూ, మిడ్నైట్ బ్లాక్, పర్పుల్, రెడ్, స్టార్‌లైట్ వైట్, ఎల్లో కలర్స్ ఉన్నాయి. ఐఫోన్ 16 ధర రూ.79,900 నుంచి మొదలవుతుంది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ధర రూ.89,900. ఆపిల్ భారత్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను నిలిపివేసింది. అలాగే, ఐఫోన్ 13, ఆపిల్ వాచ్ సిరీస్-9 విక్రయాలను సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది.
iPhone 16 Series | ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్.. ధర, ఇతర వివరాలు మీకోసం..
iPhone 16 | ఐఫోన్ 16 వచ్చేసింది.. వచ్చేవారంలో దేశీయ మార్కెట్లోకి