కాలిఫోర్నియా, సెప్టెంబర్ 9: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు శుభవార్తను అందించింది యాపిల్ సంస్థ. తన తదుపరి మాడల్ ఐఫోన్ 16ను మార్కెట్లోకి విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఒకేసారి ఐఫోన్16తోపాటు యాపిల్ వాచ్ ఎక్స్, ఎయిర్బడ్డ్, హెడ్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రంగుల్లో లభించనున్న ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మాడళ్లను ఆవిష్కరించింది. వచ్చేవారంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈఫోన్లు రూ.65 వేల ప్రారంభ ధర కాగా, గరిష్ఠంగా రూ.74 వేల స్థాయిలో లభించనున్నది.
వాచ్: సిరీస్ 9, 10లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రంగుల్లో లభించనున్న ఈ వాచ్లో వాతావరణం, రైళ్ల సమాచారం కూడా పొందవచ్చును.