iPhone 14 Plus | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ప్రతి ఒక్కరికీ మోజే.. కానీ ఆ ఫోన్ ధర పిరం.. ఈ పరిస్థితుల్లో ఐ-ఫోన్ 14 ప్లస్ మోడల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆపిల్ ఐ-ఫోన్ 14 ప్లస్ విత్ 128 స్టోరేజీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.79,900. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే 29 శాతం ఆఫర్ చేస్తోంది. దీంతో ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ ధర రూ.55,999 ఉంటుంది. అదనంగా బ్యాంకు ఆఫర్లతో మరికొంత ధర తగ్గుతుంది. ఉదాహరణకు హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుపై ఈ నెల ఐదారు తేదీల్లో కొనుగోలు చేస్తే రూ.4500 ఆఫర్ ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 వరకూ డిస్కౌంట్ ఈ నెలాఖరు వరకూ ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటది. వీటితోపాటు ఐ-ఫోన్ 13 ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. దాని పనితీరును బట్టి రూ.26 వేల వరకూ ధర తగ్గుతుంది. చివరకు ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ ధర రూ.30 వేలలోపు ఉంటుంది.
ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ 1284×2778 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తో 6.7 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ అండ్ 512 జీబీ స్టోరేజీ వరకూ ఉంటుంది. ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ రెండు 12-మెగా పిక్సెల్ సెన్సర్లతో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటది. వాటిల్లో ఒకటి స్టాండర్డ్, మరొకటి ఆల్ట్రా వైడ్ ఆప్షన్ కలిగి ఉండటంతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 4352 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!