హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కు ఔత్సాహికులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఆగస్టు 12న స్టార్టప్‌ల ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు మొదటి విడత, సెప్టెంబర్ 29న రెండో విడతతో పాటు తుది ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు.
మొత్తం 33 జిల్లాల నుంచి ఔత్సాహికులు తమ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా హైదరాబాద్‌తో పాటు జోగులాంబ గద్వాల్, మేడ్చల్, నిర్మల్, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో స్టార్టప్‌ల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నామని నిర్వాహకులు ప్రకటించారు. వివరాలకు https://bit.ly/3JUdHNE లింకు లో సంప్రదించాలని సూచించారు.