Hindenburg – SEBI Chairperson | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అనుబంధ విదేశీ సంస్థల్లో తమ కుటుంబ పెట్టుబడులపై సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్ పెదవి విప్పారు. పాఠశాల నుంచి ఐఐటీ ఢిల్లీలో విద్యాభ్యాసం వరకూ బాల్య స్నేహితుడైన అనిల్ అహుజా.. ఐపీఈ-ప్లస్ ఫండ్ (IPE-Plus Fund) చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్‌గా ఉన్నందున తన భర్త ధావల్ బుచి ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు.
హిండెన్ బర్గ్ తన ప్రజా వేగు ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా చేసిన ఆరోపణలపై మాధాబీ పురీ బుచ్ 15-పాయింట్ల క్లారిఫికేషన్ ఇచ్చారు. దశాబ్దాల పాటు స్ట్రాంగ్ ఇన్వెస్టింగ్ కెరీర్లో కొనసాగిన తన భర్త సిటీ బ్యాంక్, జేపీ మోర్గా, 3ఐ గ్రూప్ పీఎల్సీ ల్లో మాజీ ఉద్యోగిగా అనిల్ అహుజా ఉన్నందునే అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో తన భర్త పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. 2018లో ఐపీఈ-ప్లస్ ఫండ్’లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఈ ఫండ్ సీఐఓగా అనిల్ అహుజా వైదొలగగానే తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు బుచ్ ఫ్యామిలీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సింగపూర్‌లో తాము సాధారణ పౌరులుగా జీవిస్తున్నప్పుడు 2015లో ఐపీఈ-ప్లస్ ఫండ్’లో పెట్టుబడులు పెట్టామని సెబీ చీఫ్ మాదాబి పురీ బుచ్ తెలిపారు. సెబీలో పూర్తికాల సభ్యురాలిగా చేరడానికి రెండేండ్ల ముందు ఈ పెట్టుబడులు పెట్టినట్లు వివరణ ఇచ్చారు.
బ్లాక్ స్టోన్ మద్దతుతో పని చేస్తున్న మైండ్ స్పేస్, నెక్సన్ సెలెక్ట్ ట్రస్ట్ లకు చెందిన ఆర్ఈఐటీ ఐపీఓకు సెబీ ఆమోదం లభించడాన్ని హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రశ్నించింది. అదే సమయంలో బ్లాక్ స్టోన్ సంస్థలో సీనియర్ అడ్వైజర్‌గా ధావల్ బుచి నియామకానికి ఆమోదం లభించిందని గుర్తు చేసింది. సెబీ చైర్ పర్సన్ గా నియామకం కావడానికి ముందే బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీనియర్ అడ్వైజర్ గా ధావల్ బుచి నియమితులయ్యారని మాధాబీ పురి బుచ్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ స్టోన్ అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థలతో ధావల్ బుచి అనుబంధం కలిగి ఉండే అవకాశమే లేదని పేర్కొంది.