ముంబై, జూన్ 23: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) శుక్రవారం ఓ సరికొత్త క్లోజ్-ఎండెడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇదో నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ప్లాన్. ‘ధన్ వృద్ధి’ పేరుతో పరిచయమైన ఈ పీరియడ్ ప్లాన్ ద్వారా పాలసీదారులు అటు రక్షణ, ఇటు పొదుపును అందిపుచ్చుకోవచ్చని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలియజేసింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకే ఈ ప్లాన్ను అమ్మనున్నట్టు సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
రెండు ఆప్షన్లలో ప్లాన్
ధన్ వృద్ధి ప్లాన్ను ఎల్ఐసీ రెండు ఆప్షన్లలో తీసుకొచ్చింది. తొలి ఆప్షన్లో బీమా తీసుకున్న మొత్తానికి ఏటేటా ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.60 నుంచి 75 వరకు గ్యారెంటీడ్ ఆడిషన్ (కచ్చితమైన బోనస్) ఉంటుంది. రెండో ఆప్షన్లో రూ.25 నుంచి 40 వరకు గ్యారెంటీడ్ ఆడిషన్ పొందవచ్చు. దీంతో బీమా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత అదనపు లాభాల్ని అందుకోవచ్చని ఎల్ఐసీ తెలియజేసింది.
ధన్ వృద్ధి పాలసీ విశేషాలు