హైదరాబాద్, ఆగస్టు 19: అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ.. గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు టెక్నాలజీ పరంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘టెక్బీ’ ఎర్లీ కేరియర్ ప్రొగ్రాంతో ఉన్నత విద్యావంతులకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నట్టు, ఆ తర్వాత నేరుగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నట్టు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారామన్ తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థుల్లో ప్రతిభ అంతంత మాత్రంగానే ఉంటుందని, ఇలాంటి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సంస్థలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.