ఈ-ఇన్సూరెన్స్ ఖాతాల్ని తెరవండి
- భౌతిక డాక్యుమెంట్లను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చండి
- బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బీమా సంస్థలు తమ పాలసీదారుల కోసం ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరవాలని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆదేశించింది. కస్టమర్ల సౌకర్యార్థం బీమా పాలసీలకు సంబంధించిన భౌతిక పత్రాలను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చాలని ఎప్పట్నుంచో కోరుతున్న ఐఆర్డీఏఐ.. అందులోభాగంగానే ఈ-ఇన్సూరెన్స్ ఖాతాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నది.
అయితే అన్ని కొత్త ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆన్లైన్ ఫార్మాట్లోనే లభించాలన్న ఐఆర్డీఏఐ.. వచ్చే ఏడాది డిసెంబర్కల్లా ప్రస్తుత, పాత పాలసీల పత్రాలన్నీ కూడా సవరించదగిన ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చాలని తాజా సమావేశంలో బీమా సంస్థలకు స్పష్టం చేసింది.
దీనివల్ల పాలసీ రెన్యువల్ సమయంలో పాలసీదారుడి పని సులువవుతుందని, పేపర్ వర్క్ ఉండదని, పైగా లావాదేవీల ఖర్చు తగ్గడమేగాక పాలసీల్లో సవరణలూ వేగిరమవుతాయని ఐఆర్డీఏఐ అంటున్నది. అయితే పాలసీ పత్రాలను ఆన్లైన్ ఫార్మాట్లోకి మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలను జీవిత, ఇతర బీమా సంస్థలకు ఈ సమావేశంలో ఐఆర్డీఏఐ అధికారులు వివరిస్తూనే.. దీనిపై వారి అభిప్రాయాలనూ కోరారు. కాగా, నవంబర్ 1 నుంచి అన్ని బీమా పాలసీలకు ఈకేవైసీ తప్పనిసరి.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్లతో బీమా పాలసీలు అనుసంధానించబడతాయి. మరోవైపు బీమా పాలసీల విక్రయం, సేవలు, క్లయిముల పరిష్కారార్థం ‘బీమా సుగమ్’ అనే ఓ డిజిటల్ వేదికనూ అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమకు ఐఆర్డీఏఐ సూచిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి బీమా సుగమ్ అందుబాటులోకి వచ్చే వీలున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

